ETV Bharat / city

JP Nadda hyderabad Visit : రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా.. నాలుగు రోజులు ఇక్కడే మకాం - తెలంగాణ వార్తలు

JP Nadda hyderabad Visit : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కీలక సమావేశాలు హైదరాబాద్​లో జరగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు జేపీ నడ్డా హైదరాబాద్​కు రేపు చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. జాతీయస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేతలు పాల్గొననున్నారు.

JP Nadda hyderabad Visit,  RSS Meeting 2022
రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా
author img

By

Published : Jan 3, 2022, 9:47 AM IST

JP Nadda hyderabad Visit : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కీలక సమావేశాలకు ఈసారి రాష్ట్రం వేదిక కానుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌ శివారులోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం(ఆర్‌వీకే)లో ఈ సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. నడ్డాకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలకాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

మోహన్‌ భాగవత్‌ సహా కీలక నేతల రాక

జాతీయస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌తో పాటు సర్‌ కార్యవాహ్‌ దత్తాత్రేయ హోసబలే, అయిదుగురు సహ కార్యవాహ్‌లతో పాటు వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. భాజపా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్‌.సంతోష్‌తో పాటు సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ హాజరు కానున్నారు. పరివార్‌లోని సంస్థలు 2021లోని లక్ష్యాల్ని ఏ మేరకు సాధించాయి, 2022లో లక్ష్యాల నిర్దేశం, జాతీయస్థాయి అంశాలు, సంస్థల మధ్య సమన్వయం.. సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Bhadradri adhyayana utsavalu 2022: నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు..JP Nadda hyderabad Visit for RSS Meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.