ETV Bharat / city

'80శాతం ఇంజినీర్లు ఎందుకూ పనికిరారు' - jayaprakash narayana on indian education system and health

నూటికి 80శాతం మంది ఇంజినీర్లు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారని లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్​(ఎఫ్‌డీఆర్‌) ప్రధాన కార్యదర్శి జయప్రకాష్‌ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. పేరుకే ఇంజినీరింగ్‌ విద్య... అయినప్పటికీ 21వ శతాబ్దంలో ఈ ఆధునిక సమాజంలో వృత్తికి పనికిరావడం లేదన్నారు.

'80శాతం ఇంజినీర్లు ఎందుకూ పనికిరాని స్థితిలో ఉన్నారు'
author img

By

Published : Nov 14, 2019, 11:10 PM IST

Updated : Nov 14, 2019, 11:45 PM IST

దేశంలో విద్య అధ్వాన స్థితిలో ఉంటే ఇతర దేశాలతో ఏవిధంగా పోటీ పడగలం, ఆర్థిక ప్రగతి ఎలా సాధించగలమని లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఈవీ రామ్‌రెడ్డి, మామిడి బోజ్‌ రెడ్డిల స్మృతికి గౌరవంగా ఇవాళ విద్య, ఆరోగ్యం అంశాలపై హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాల(ఆస్కీ)లో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. జయప్రకాష్‌ నారాయణతో పాటు ప్రముఖ ఆచార్యులు జఫ్రే హమ్మెర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని దేశంలో విద్య, ఆరోగ్యం అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న యువత అధికంగా ఉండడం... ఎంతో గర్వంగా ఉన్నా...దానిని సమర్ధవంతంగా వినియోగించుకోలేక సదవకాశాన్ని జారవిడుచుకుంటున్నామని జయప్రకాష్‌ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాణాలతో కూడిన పనికొచ్చే విద్య లేకుండా యువతలోని ప్రతిభాపాఠవాల్ని వెలికి తీయలేమని...తగిన ఫలితాలు రావని పేర్కొన్నారు.

దేశంలోని పీహెచ్​సీలు అధ్వాన్నంగా ఉన్నాయని... అనారోగ్యంతో లక్షలాది మంది చనిపోతున్నారని... కోట్లాది మంది అనారోగ్యంతో పేదలవుతున్నారన్నారు. వాటి రూపరేఖలు మార్చడం పట్ల ఆలోచించాల్సి ఉందన్నారు. విద్య, ఆరోగ్యాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువులుగా చేసి... జేబులో నుంచి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య, వైద్యం అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

sample description
Last Updated : Nov 14, 2019, 11:45 PM IST

For All Latest Updates

TAGGED:

jp talks
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.