ఓజోన్ పొరను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిగ్నేచర్ బ్రాండ్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ కొత్తపేట సత్యనగర్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్మాగారాలు, వాహనాలు విడుదల చేస్తున్న విషవాయువులు తగ్గించాలని ఆయన సూచించారు. ఏసీ, రిప్రిజిరేటర్లు అధికంగా వినియోగించడం వల్ల ఓజోన్ పొరకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల నరికివేతను అడ్డుకోవడం ద్వారా.. పర్యావరణాన్ని, ఓజోన్ పొరను రక్షించుకోవచ్చన్నారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా