ETV Bharat / city

ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహనీయులను స్మరించుకున్నారు. వారి ఆశయ సాధన కోసం అంతా కలిసి కృషి చేయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు

author img

By

Published : Aug 15, 2020, 2:29 PM IST

ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు

కరోనా వేళ రాష్ట్రంలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. శాసనసభ ఆవరణలో పోచారం, మండలి ప్రాంగణంలో గుత్తా మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.

సచివాలయంలో..

సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మువ్వన్నెల జెండా ఎగురవేశారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెరాస భవన్​లో..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తోందని తెరాస నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. తెరాస భవన్‌లో స్వాతంత్ర్య దిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కేకే... త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

తెలంగాణ భవన్​లో...

రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కోల్పోకుండా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. గాంధీభవన్‌లో వేడుకలకు ఉత్తమ్ సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. కరోనా వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

భాజపా కార్యాలయంలో..

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ప్రగతివైపు పరుగులు పెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆరేళ్ల పాలనలో ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌ భవన్‌లో..

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డి, తెజస కార్యాలయంలో కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. తెరాస హయాంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆక్షేపించారు. కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ పేద ప్రజలను గాలికి వదిలేశాయని ఆక్షేపించారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో..

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహ న్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు కమిషన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. నాంపల్లిలోని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ ఘంటా చక్రపాణి జాతిపితకు నివాళులు అర్పించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ జాతిపితకు నివాళులు అర్పించి.. మువ్వన్నెల జెండా ఎగురవేశారు.

పాతబస్తీలో..

హైదరాబాద్ పాతబస్తీ మదీనా క్రాస్​ రోడ్ వద్ద నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎంపీతో పాటు మహమూద్ ఖాద్రి, ముజఫ్ఫర్ కార్పొరేటర్లు, ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఔరా: జాతీయ జెండా ఎగరవేసిన చిలుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.