ETV Bharat / city

అక్కడి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలు భయపడుతున్నారా..? - తూర్పు గోదావరి తాజా వార్తలు

కొవిడ్ కారణంగా ఏపీలోని పాఠశాల్లో భోజనం చేసేందుకు కూడా పిల్లలు భయపడుతున్నారు. కరోనా నిబంధనలు అనుసరించి మెుదలైన పాఠశాల్లో.. మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది. కానీ ఈ ఆహారాన్ని 50శాతం మంది విద్యార్ధులు కూడా తినటం లేదు. భోజనాన్ని వడ్డించే నిర్వహకులకు కొవిడ్ సోకి ఉండవచ్చుననే భయంతో తల్లిదండ్రులు వారి పిల్లలను తినొద్దని వారిస్తున్నారు.

mid day meal
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలు భయపడుతున్నారా..?
author img

By

Published : Nov 9, 2020, 12:47 PM IST

కరోనా భయంతో ఏపీలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినడానికి విద్యార్థులు జంకుతున్నారా..? ఆరు రోజులుగా పథకంలో నమోదైన గణాంకాలు అలాంటి పరిస్థితినే సూచిస్తున్నాయి. కరోనా అన్‌లాక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 2 నుంచి తెరుచుకున్నాయి. పదో తరగతి విద్యార్థులు రోజూ, తొమ్మిదో తరగతి వారు రోజు విడిచి రోజు హాజరుకావాలని ఉత్తర్వులిచ్చారు. అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని, గదుల్లో శానిటైజేషన్‌ చేయాలని, తరగతికి 16 మంది విద్యార్థులనే ఉంచాలని, అందరూ మాస్క్‌లు ధరించాలని ఆదేశాలిచ్చారు. పాఠశాలకు వచ్చిన వారందరికీ జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) వేడిగా వండి వడ్డించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల్లో భోజనం చేస్తున్న వారి సంఖ్య 50 శాతం లోపే ఉంటోంది. కొందరు కరోనా బెరుకుతో మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటుండగా.. మరికొందరు ఒంటిపూట బడులే కావడంతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

ఏం జరిగింది..?

ఏపీలో మొదటి రోజున పిల్లలంతా ఉత్సాహంగా బడికి వచ్చారు. 10,657 మంది విద్యార్థులు హాజరుకాగా 5,733 మంది మధ్యాహ్న భోజనం చేశారు. మరుసటి రోజునే జిల్లాలో అంబాజీపేటలో కరోనా పాజిటివ్‌ వచ్చిన భోజన పథకం నిర్వాహకురాలు పిల్లలకు వడ్డించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇతర జిల్లాల్లో సైతం పలువురు విద్యార్థులకు కరోనా సోకిందన్న వార్తలు రావడంతో తల్లిదండ్రుల్లో భయాన్ని పెంచాయి. ఒక వేళ బడికి వెళ్లినా తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని భోజనాలకు ఇళ్లకు వచ్చేయాలని చెబుతున్నారు. దీంతో రెండో రోజు నుంచే బడిలో భోజనాలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వారం రోజులూ ఈ సంఖ్య క్రమంలో తగ్గుముఖం పడుతోంది.

అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం..

బడులకు హాజరవుతున్న విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం చేసేందుకు అనువైన అన్ని పరిస్థితులు కల్పిస్తున్నాం. వంట చేసే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. శుభ్రమైన వాతావరణంలో, కొవిడ్‌ -19 మార్గదర్శకాల ప్రకారం అన్నీ చేస్తున్నాం. నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల వారు, డిసెంబరు 14 నుంచి 1-5 తరగతుల వారు పాఠశాలలకు హాజరవుతారు. అప్పుడు విద్యార్థుల హాజరు పెరుగుతుంది. ఉపాధ్యాయులంతా మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా నడిచేలా దృష్టి సారించాలి. - అబ్రహం, డీఈవో

నవంబరు రెండున పాఠశాలలు తెరిచిన నాటి నుంచి శనివారం వరకు ఆరు రోజుల్లో జిల్లాలో 9,10 తరగతుల వారు 1,10,187 మంది నమోదయ్యారు. ఇందులో బడికి హాజరైన వారు 31,771 కాగా భోజనాలు చేసిన వారి సంఖ్య 15,807 మాత్రమే.

ఇవీచూడండి: మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.