ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేని లేఅవుట్లకు తక్షణం నోటీసులు జారీ చేయాలని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీ, అర్బన్ అథారిటీ పరిధిలోని అనధికార లే అవుట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా వేసిన లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంచాయతీల్లో 6,049 అనధికారిక లేఅవుట్లు గుర్తించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. అర్బన్ పరిధి పంచాయతీల్లో వచ్చే లే అవుట్ ఫీజులతో పాటు... కొంత ఫీజును ఆయా పంచాయతీలకు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే పంచాయతీల్లోనూ ఎల్ఆర్ఎస్ తీసుకురావాలనే అంశంపై చర్చ జరిగింది. ప్రతి లేఅవుట్ను పంచాయతీరాజ్, అర్బన్ అథారటీ పర్యవేక్షించాలని ఈ మేరకు మంత్రులు ఆదేశించారు.
ఇదీ చదవండి: 'చెరువు శిఖం భూమిలో రైతు వేదిక నిర్మాణంపై నివేదిక ఇవ్వండి'