రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా.. దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాల్లో తీవ్ర 7.6 కి. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లికొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో 19 జిల్లాల్లో గురువారం పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.