ETV Bharat / city

శివారుపై కన్ను... భాగ్యనగరంలో భూ బకాసురులు

వివాదాస్పద భూములే వారికి ప్రధాన ఆదాయ వనరు. ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మక్కై భూముల్నిధారాదత్తం చేయడంలో ఆరితేరారు. లంచం ముట్టచెబితే ప్రభుత్వ స్థలాలనూ కట్టబెడతారు. పద్ధతి మార్చుకోవాలంటూ స్వయంగా సీఎం కేసీఆర్ హెచ్చరికలు చేసినా వారి తీరు మారడం లేదు. హైదరాబాద్‌ నగర శివారుల్లో రియల్‌ బూమ్‌తో భూ బకాసురులకు అండగా ఉంటూ స్వాహా పర్వానికి తెరలేపుతున్నారు.

illegal-persons-invasion-of-hyderabad-suburbs
హైదరాబాద్ శివారు భూములపై కన్నేసిన అక్రమార్కులు
author img

By

Published : Aug 16, 2020, 9:54 PM IST

హైదరాబాద్ శివారు భూములపై కన్నేసిన అక్రమార్కులు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో... స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. భూములకు విలువ పెరగడం వల్ల.. కొందరు అక్రమార్కులు వాటిపై కన్నేశారు. వివాదంలో ఉన్న ప్రైవేటు భూములను కనిపెట్టి వాటిని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్నారు.

తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూమి కబ్జాకు గురవుతోంది. వివాదాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత‌్వం తెచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన.. రెవెన్యూ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. సివిల్ వివాదాలు, కోర్టు కేసుల్లో భూములు ఉండగానే అధికారులు లంచాలకు ఆశపడి ఒకరి భూమిని మరొకరి పేరిట మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలైన పట్టాదారులు, రైతులను కాదని.. ఇతరులకు పట్టాదార్‌ పాసుపుస్తకాలు జారీ చేశారు. న్యాయం కోసం పలువురు బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. రాంపల్లి భూముల విషయంలోనూ న్యాయస్థానాల చుట్టూ తిరగలేక సెటిల్మెంట్‌కు.. వెళ్లామని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

ప్రజా ప్రతినిధులు..

నగర శివారుల్లో ఆసైన్డ్ భూములు భారీగా ఉన్నాయి. వాటి ధరలు ఆకాశాన్నంటడం వల్ల భారీగా చేతులు మారుతున్నాయి. భూ వివాదాల వెనుక.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల పాత్ర ఉంటోంది. ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ఆక్రమించుకుని వాటా ఇవ్వాలంటూ బహిరంగంగా డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదే అదునుగా అధికారులు అవినీతిలో చెలరేగిపోతున్నారు. లంచం సొమ్ము పుచ్చుకుంటూ నేరుగా పట్టుబడటమేకాక.. తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు లభ్యమవుతోంది. పన్ను కట్టలేని సొమ్ముతో భూములు, ఇళ్లు వంటి స్థిరాస్తులతోపాటు బంగారం, వాహనాలు వంటి చరాస్తుల్ని బినామీల పేరుతో కూడబెట్టుకుంటున్నారు. గతంలో కేశంపేట తహసీల్దార్ లావణ్య ఇంట్లో కళ్లు చెదిరే రీతిలో ఏకంగా 93 లక్షల నగదు లభ్యం కావడమే అందుకు ఊదాహరణ.

లంచం ఇవ్వజూపి

భూవివాదంలో అనుకూల దస్త్రాలు ఇచ్చేందుకు ఏకంగా కోటి 10 లక్షల లంచం తీసుకున్న కేసులో కీసర తహసీల్దార్ నాగరాజుతోపాటు లంచం ఇవ్వజూపిన ప్రైవేటు వ్యక్తులు అంజిరెడ్డి, శ్రీనాథ్ కటకటాల పాలయ్యారు. నేరం రుజువైతే అధికారులకు వర్తించే శిక్షలే ప్రైవేట్‌ వ్యక్తులకి వర్తిస్తాయని అనిశా అధికారులు అంటున్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం...ప్రభుత్వాధికారి నుంచి పని చేయించుకునేందుకు లంచం ఇవ్వజూపడమూ నేరమేని చెబుతున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.