కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులకి తీసుకొచ్చేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారత్ బయోటక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చింది.
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి విశాఖ కేజీహెచ్‌ను భారత వైద్య పరిశోధన మండలి ఎంపిక చేసింది. అలాగే వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ అధికారిగా కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ వాసుదేవ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే విమ్స్‌లో కరోనా రోగులకు వైద్యం అందించే విధుల్లో ఉన్నారు.