ETV Bharat / city

గర్భిణిని ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటిన పోలీసులు - సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు

హైదరాబాద్​ పోలీసులు మరోసారి మానవత్వం చాటారు. పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్​ వాహనంలో సమీప ఆసుపత్రికి చేర్చి ఔదార్యాన్ని చాటారు.

Hyderabad police help for pregnancy women at santhosh nagar police man
గర్భిణిని ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటిన పోలీసులు
author img

By

Published : Apr 15, 2020, 5:50 AM IST

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్​ వాహనంలో జడ్జి ఖాన హాస్పిటల్​కు చేర్చి మానవత్వాన్ని చాటారు. హైదరాబాద్​ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్ బండ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంది. ఆమె కుటుంబీకులు 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది స్పందించ లేదు. దీంతో వారు 100నంబర్​కు డయల్ చేయగా..... నిమిషాల్లోనే కానిస్టేబుల్​ శ్రీకాంత్​, సుజిత్ పెట్రోలింగ్​ కారులో అక్కడికి చేరుకున్నారు.

అక్కడి పరిస్థితిని గమనించిన వారు పెట్రోలింగ్​ వాహనంలో నయాపూల్ దగ్గర ఉన్న జడ్జి ఖాన ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.