ETV Bharat / city

అత్యవసరానికే పాసులు.. దుర్వినియోగం చేయొద్దు: అంజనీకుమార్

లాక్​డౌన్​ దృష్ట్యా.. అత్యవసర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి పాస్​లు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు. పాస్‌ల కోసం covid19.hyd@gmail.com మెయిల్​ ఐడీకి, 9490616780 వాట్సప్‌నకు సందేశాలు పంపొచ్చని వెల్లడించారు.

anjanikumar
అత్యవసర విభాగాల సిబ్బందికి పాస్​ల కేటాయింపు: హైదరాబాద్​ సీపీ
author img

By

Published : Mar 25, 2020, 6:40 PM IST

Updated : Mar 25, 2020, 7:37 PM IST

ప్రధాని పిలుపు మేరకు 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. 10 వేల మంది నగర పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఇవాళ 4 గంటలపాటు పరిస్థితులపై సమీక్షించినట్లు తెలిపారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

పాస్​ కోసం ఈమెయిల్​ లేదా వాట్సాప్​..

హైదరాబాద్‌కు సంబంధించి 900 పాస్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కూడా పాస్‌లు ఇచ్చామన్న సీపీ.. ఇంకా 700 పాస్‌లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పాస్‌ల కోసం covid19.hyd@gmail.com, 9490616780 నంబర్‌కు వాట్సప్‌ సందేశాలు పంపవచ్చని వెల్లడించారు.

దుర్వినియోగమైతే.. రద్దే...

పాల వాహనం అని రాసి ఉన్న ట్యాంకర్లకు పాస్‌లు అక్కర్లేదని.. పాల ఉత్పత్తులకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్‌, ఏజెంట్లకు పాస్‌లు ఇస్తామని అంజనీకుమార్​ తెలిపారు. ఈ-కామర్స్‌కు సంబంధించి నిత్యవసర వస్తువులకు మాత్రమే పాస్‌లు మంజూరు చేస్తామన్నారు. పాస్‌లను దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వస్తే రద్దు చేస్తామని హెచ్చరించారు. కూరగాయల విక్రయదారులు ఆయా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడాలని సీపీ సూచించారు.

ఏపీ, కర్ణాటక నుంచి మీరాలంమండికి లారీలు వస్తాయని.. వాటికి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ, అసోసియేషన్‌లు అనుమతి తీసుకోవాలన్నారు. గోదాంల నుంచి కూరగాయలను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు చిన్న ఆటోలు వాడాలని.. ఆయా వాహనాలకు కూడా పాస్​లు ఇస్తామని అన్నారు.

ఆస్పత్రుల్లో అంబులెన్స్‌ డైవర్లు, గ్రూప్‌-4 సిబ్బందికీ పాస్​లు మంజూరు చేస్తామని సీపీ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్​ కేంద్రాల సిబ్బంది పాస్​లు పొందవచ్చన్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది వారి గుర్తింపు కార్డును చూపించి పాస్‌లు తీసుకోవచ్చని హైదరాబాద్​ సీపీ తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి వెళ్లే వారికి యాజమాన్యమే అనుమతి పత్రం ఇస్తుందన్నారు.

వంటగ్యాస్‌ సరఫరా వాహనాలకు ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదని సీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగాలన్నారు.

'అత్యవసరానికి పాసులిస్తున్నాం.. దుర్వినియోగం చేయొద్దు'

ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్

Last Updated : Mar 25, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.