జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున అందరు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అధికారులకు సూచించారు. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ సమయంలో పోలీసులది ప్రధాన పాత్ర ఉంటుందని సీపీ అన్నారు.
ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నగర కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బందితో సీపీ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగర పోలీసులకు చాలా మంచి అనుభవం ఉందన్నారు. గత ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ ఎన్నికల కమిషన్ అభినందించిందని గుర్తుచేశారు.
నాన్ బెయిలబుల్ వారెంట్లు, బైన్డ్ ఓవర్ కేసులుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలు సమర్పించే విషయంలో ఇవాళ్టి నుంచి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో బాగా పనిచేసి.. ప్రతి ఒక్కరూ తమ పనితీరును మెరుగుపర్చుకోవాలి.
-అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ
ఇవీచూడండి: పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి: లోకేశ్‌కుమార్