ETV Bharat / city

'పీవీ కీర్తి ప్రతిష్ఠలను పెంచే విధంగా వంగర గ్రామ అభివృద్ధి' - pv narasimha rao own village vangara

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు.

husnabad mla sateesh meets minister srinivas goud

author img

By

Published : Oct 16, 2020, 7:44 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా... చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించారు.

పీవీ నరసింహారావు యావత్ తెలుగువారితో పాటు దేశం, ప్రపంచం గర్వించదగిన మహనీయుడని ఎమ్మెల్యే సతీశ్​ కొనియాడారు. పీవీ శత జయంతిని ఏడాది పొడుగునా అధికారికంగా దేశ విదేశాల్లో నిర్వహించాలని, అలాగే ఆయన స్వగ్రామం వంగరను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.

పీవీ స్వగ్రామం వంగర హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండడం తమకు ఏంతో గర్వకారణమన్నారు. పీవీ కీర్తి ప్రతిష్ఠలను, వంగర ప్రాముఖ్యతను చిరకాలం గుర్తుండిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మూడోరోజు కేటీఆర్ పర్యటన.. జీహెచ్​ఎంసీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.