హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఈనెల 23న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. కవులు, కళాకారులు, రచయితలు బుక్ ఫెయిర్‌ను సందర్శించి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
అన్ని భాషలకు చెందిన నవలలు సందేశాత్మకమైన పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, సినిమా కథ పుస్తకాలు, చరిత్ర, చిన్నారుల కథల పుస్తకాలు, కామిక్స్ వంటి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తమకు కావాల్సిన పుస్తకాలు అన్నీ ఒకే దగ్గర దొరకడం... రాయితీలు ఇస్తుండటం వల్ల ఇక్కడికి వస్తున్నట్లు సందర్శకులు తెలిపారు.
ఇదీ చూడండి: పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన