గుమ్మడి కాయలు సాధారణంగా 10 నుంచి 15 కిలోల వరకు ఉంటాయి. అలాంటిది ఓ ఇంట్లో ఉన్న గుమ్మడి పాదుకు ఏకంగా 25 కిలోల బరువున్న భారీ కాయలు కాస్తున్నాయి. కడప జిల్లా సుండుపల్లి పరిధి ఏటిగడ్డ రాచపల్లిలో నారాయణమ్మ ఇంట్లో గుమ్మడి మొక్క పెరిగి పందిరి అల్లుకుంది. ప్రస్తుతం చెట్టంత పెద్ద పరిమాణంలో ఉన్న గుమ్మడి కాయలు కాస్తున్నాయి. వాటిలో ఒక కాయ ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరిగి స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఇవీ చూడండి : చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం