Bagheera OTT Release : శాండల్‌వుడ్ స్టార్ హీరో శ్రీమురళి, సప్తసాగరాలు ఫేమ్ రుక్మిణీ వసంత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'బఘీర' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న పాన్ఇండియా లెవెల్లో థియేటర్లలో రన్ అయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తుళు ఇలా పలు భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనున్నట్లు పేర్కొంది.
Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️
— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024
Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD
స్టోరీ ఏంటంటే?
వేదాంత్ (శ్రీమురళి)కి చిన్నప్పటి నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. దీంతో అతడు కూడా అలాగే హీరోగా మారాలని ఎప్పుడూ తపనపడుతుంటాడు. అయితే " సూపర్ పవర్స్ ఉన్న వాళ్లే కాదు. ఏ శక్తులు లేకున్నా కూడా ప్రజల్ని కాపాడే తన తండ్రిలాంటి పోలీసులు కూడా సూపర్ హీరోలే" అని ఓ సారి తల్లి చెప్పిన మాటలు విని తను కూడా పోలీస్ అవుతాడు. ఈ క్రమంలో అతడు మంగళూరు ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే అక్కడున్న క్రిమినల్ ముఠాల్ని ఏరి పారేయడం మొదలు పెడతాడు. అయితే వేదాంత్ దూకుడు గమనించి ఉన్నతాధికారులు అతడిపై పరిమితులు విధిస్తారు. అది అతడిని చాలా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా తనకు దక్కిన ఆ పోలీసు ఉద్యోగం కోసం తన తండ్రి రూ.50లక్షలు లంచం ఇచ్చినట్లు తెలుసుకుని అతడు తీవ్రంగా కుంగిపోతాడు. దీంతో తన కళ్ల ముందు జరుగుతున్న నేరాల్ని కూడా పట్టించుకోవడం మానేస్తాడు.
సరిగ్గా అదే సమయంలో తన పోలీస్‌స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన కారణంగా వేదాంత్ ఓ కొత్త అవతారమెత్తుతాడు. పగలంతా ఖాకీ దుస్తుల్లో కనిపించే వేదాంత్, రాత్రి మాత్రం బఘీర అనే సూపర్ హీరోగా మారి క్రిమినల్స్‌ను వేటాడటం మొదలు పెడతాడు. అలా తనకు రాణా (గరుడ రామ్) గురించి తెలిసిన నిజాలేంటి? అతడి ఆట కట్టించేందుకు వేదాంత్ ఏం చేశాడు?ఈ జర్నీలో బఘీర ఎదుర్కొన్న సవాళ్లేంటి? స్నేహ (రుక్మిణీ వసంత్)తో వేదాంత్ ఏమైంది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
ప్రశాంత్ నీల్ ఇదంతా నిజమేనా? - Prasanth Neel Ajith Kumar
'NTR 31' ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ బజ్- షూటింగ్ ఎప్పుడంటే? - NTR Prashanth Neel