ETV Bharat / city

తాజా తాజా కూరగాయలు... ఇంటి వద్దే పండించి తినేయరూ...! - మిద్దెపై తోట

"‘ఏమోయ్‌! ఇవాళ చిక్కుడు కాయ వేపుడు తినాలనిపిస్తోంది....’ఓ అదెంత భాగ్యం... డాబా మీదికెళ్లి కోసుకు రండి... 20 నిమిషాల్లో చేసి పెడతాను!" "‘అమ్మా... కొత్తిమీర చట్నీ చేయవూ...’సరే...ఐతే- ఆ కుడివైపు బాల్కనీలోని కొత్తిమీర కాస్త కోసివ్వు!" "ఏమండీ... పప్పులోకి టమాటాలు కావాలి... కాస్త పైకెళ్లి ఓ ఐదారు కోసుకు రారాదూ...’" "‘విరగకాశాయి... ఓ రెండు తెంపుకొస్తా... సొరకాయ హల్వా చేయరూ... పెళ్లయిన కొత్తలో చేసినట్లు!’".... ఇలా ఏది కావాలంటే అది... ఎప్పుడు కావాలంటే అప్పుడు... మార్కెట్‌కు వెళ్లకుండానే... తాజా తాజాగా కోసుకు రావటం... వండుకోవటం... తినేయటం! ఒకరు కాదు ఇద్దరు కాదు... తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2.5 లక్షల ఇళ్లలో రోజూ ‘సాగు’తున్న తంతిది!

home farming in hyderabad
home farming in hyderabad
author img

By

Published : Dec 27, 2020, 6:54 AM IST

కూరగాయలు పండించాలంటే... ఎకరమో అరెకరమో భూమి... రసాయనాలు.. ఇవన్నీ ఉండాలనుకుంటున్నారా? కానేకాదు.. ఇవేవీ అక్కర్లేదు... మీ ఇల్లే ఓ చేను... మీ డాబానే ఓ పొలం... అపార్ట్‌మెంటైతే... మీ బాల్కనీ కూడా చాలు... పాతబడ్డ బకెటో... పాడైపోయిన డ్రమ్మో... మీ పాల డబ్బానో... ఖాళీ ఉప్పు ప్యాకెటైనా... ఏదైనా చాలు... మీ ఇంటికి అవసరమైన కూరగాయలు... వీలైతే కొన్ని పూలు.. కుదిరితే కొన్ని పండ్లు కూడా పండించుకోవచ్చు... నిశ్చింతగా స్వచ్ఛమైన తిండి తినొచ్చు... నెలవారీ ఖర్చులూ ఆదా చేసుకోవచ్చు! కావల్సిందల్లా... కాసింత పెట్టుబడి... రోజూ ఓ గంట ఓపిక... శ్రద్ధ! అంతే!

ఇంటింటా మిద్దె పండగ..!

నిన్న..మొన్నటి వరకూ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు కొనేందుకు రైతుబజార్లు, మార్కెట్‌లకు వెళ్లేవారు. రసాయనాల వినియోగం, రోజుల తరబడి నిల్వ ఉంచటంతో తాజాదనం.. రుచి తగ్గేవి. ధరల్లో స్థిరత్వం లేకపోవడం. వీటి నుంచి బయటపడేందుకు.. పలువురు ఇంటిని, ఇంట్లోని డాబాలను పంట స్థలంగా మార్చుకుంటున్నారు. అందుబాటులోకి వచ్చిన సాగు పద్ధతులను అవలంబిస్తూ మిద్దెతోటలతో సొంతగా కుటుంబానికి అవసరమైన ఫలసాయం పొందుతున్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ ప్రజలకు అవసరమైన కాయగూరలు.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, మెదక్‌ తదితర జిల్లాల నుంచి వచ్చేవి. వేసవికాలం, అకాలవర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులు సాగును దెబ్బతీసేవి. ఆ సమయాల్లో ఆకాశాన్నంటిన ధరలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపేవి.

మేం కూరగాయలు కొనక నెలలైంది

మేం కూరగాయలు కొనక కొన్ని నెలలవుతోంది. లాక్‌డౌన్‌లోనూ పండ్ల కోసం బయటకు వెళ్లలేదు. ఇరుగు పొరుగు కుటుంబాలూ ఆడపాదడపా మా పెరట్లోనే కోసుకెళ్లేవారు. 500-550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వంకాయ, టమాటా, క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్‌, మందారం, గులాబీలు, అన్ని రకాల తులసి మొక్కలు పెంచుతున్నాం. దానిమ్మ, నిమ్మ, నేరేడు చెట్లూ ఉన్నాయి. ప్రతినెలా ఇంటి బడ్జెట్‌లో రూ.2000-2500 వరకూ ఆదా. కూరలు త్వరగా ఉడుకుతున్నాయి. రుచిగా ఉంటున్నాయి.

- ఎం.సుధాకర్‌, విశ్రాంత శాస్త్రవేత్త, హబ్సిగూడ, హైదరాబాద్‌

రెండు నెలలుగా మార్కెట్‌కు వెళ్లలేదు

ఏపీలోని గుంటూరు వేణుగోపాల్​నగర్​కు చెందిన బసవపున్నయ్య, కృష్ణకుమారి దంపతులు... మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు నెలలుగా మిద్దె తోటలో పండే కూరగాయలనే వాడుతున్నారు. బంగాళదుంప, ఉల్లిపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిద్దె పంటకు జింక్‌ పైపులతో స్టాండ్‌లు చేయించారు. ‘‘మన ఇంట-సేంద్రియ పంట’’ అనే వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఏడు గంటలకు అమెరికాలో ఉంటున్న మనవరాలికి వీడియో ద్వారా మిద్దె తోటను చూపడంతో పనులను ప్రారంభిస్తారు.

2వేల దాకా ఆదా...

- జ్యోత్స్నరాణి, మూసారాంబాగ్‌, హైదరాబాద్‌

కాస్త సమయం కేటాయిస్తూ.. ఓపిక వహిస్తే చాలు. మిద్దెతోట పంటతో ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చు. మా టెర్రస్‌పై బెండ, దోస, ఆకుకూరలు, టమోటా సాగు చేస్తున్నాం. ప్రతి నెలా సగటున రూ.2000-3000 వరకూ పొదుపు చేస్తున్నాం. డబ్బులను మించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం.

ఇంటితోట ప్రకృతి వరం

* ప్రోత్సహిస్తే నగర/పట్టణాల్లో 90 శాతం కూరగాయలు, పండ్ల అవసరాలను మిద్దెతోటలు తీరుస్తాయి.

* అధికశాతం అపార్ట్‌మెంట్స్‌, విల్లాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి.

* ఇంటిపంట సాగులో సరైన సాధన అవసరం. భూమ్మీద వ్యవసాయానికి దీనికీ కొంత తేడా ఉంటుంది.
* అడుగు ఎత్తులో ఇటుక, సిమెంట్‌తో మడులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా టెర్రస్‌కు నీరు, మట్టి అంటదు

* తెగుళ్లు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. పురుగులను చేతితో తీసి పారేయొచ్చు.

* ఎండిన ఆకులు, వ్యర్థాలతో సేంద్రియ ఎరువును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

* తక్కువనీరు వాడటం వల్ల వృథానీటి సమస్య తలెత్తదు.

పాడైపోయిన వాటితోనే....

-ముదుగంటి నిరంజన్‌రెడ్డి, కొయ్యూర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసి హన్మకొండలోని స్నేహనగర్‌లో స్థిరపడ్డారు. వ్యవసాయ అనుభవంతో ఇంటి మిద్దెపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతూ అబ్బురపరుస్తున్నారు. ఇందుకోసం ఆయన వేలాది రూపాయలేమి వెచ్చించలేదు. కేవలం పగిలిపోయిన ప్లాస్లిక్‌ బకెట్లు, సీసాలు, పనిచేయని కూలర్లు, వృథాగా పారేసిన శీతలపానీయ, నీరు, రంగుల డబ్బాలు, సిమెంట్‌ సంచులు, కుండలలో మొక్కలను పెంచుతున్నారు. అవసరమైనప్పుడు బెల్లం పానకాన్ని మొక్కలపై చల్లుతానని, బెల్లం వాసనకు చీమలు చేరుకుని మొక్కలకు హాని చేసే పురుగులను తింటాయని నిరంజన్‌రెడ్డి చెప్పారు.

సూర్యరశ్మి తప్పనిసరి

- తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ పిడిగం సైదయ్య

* టెర్రస్‌, బాల్కనీ, కారిడార్‌, వరండా, మిద్దె పైభాగం.. ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా.. కుటుంబానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు.

* మిద్దెపంటల సాగుకు టమాటా, బెండ, వంకాయ వంటివి అనుకూలం.

* దుంప కూరలు నాటేటపుడు ప్లాస్టిక్‌, పాలీబ్యాగ్స్‌ పొడవుగా ఉండాలి.

* దేశవాళీ విత్తనాలు, సూటిరకాలతో తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. నీరు ఎక్కువ అవసరపడదు.

* వేరుకుళ్లు తెగులు సోకకుండా వృథానీరు బయటకు పోయేలా ఏర్పాట్లు తప్పనిసరి.

* ఏ రకం మొక్కలకైనా కనీసం 3-4 గంటలు ఎండ తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
* మొక్కల పెంపకానికి ప్లాస్టిక్‌, టెర్రకోట, సిమెంట్‌ తొట్లు ఎంపిక చేసుకోవాలి.
* మొక్కలకు నాటేందుకు ఎర్రమట్టి ఉత్తమం. కోకోపీట్‌ పౌడర్‌, సూక్ష్మపోషకాలు చేర్చాలి.
* ఏ పంటరకమైనా ఐదు రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయవచ్చు.
* మజ్జిగ, ఇంగువ కలిపిన పుల్లని మజ్జిగ పోషకంగా పనిచేస్తుంది.
* పుల్లటిమజ్జిగ, గోమూత్రం, పచ్చిమిరపపండ్లు, అల్లం, వెల్లుల్లి మూడు కలిపిన ద్రావణం. వేపనూనె, బూడిద, గంజి పిచికారీ చేయవచ్చు.

2.5 లక్షల కుటుంబాలు

తాజా కాయగూరల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2014లో తెలంగాణ ఉద్యానశాఖ అర్బన్‌ గార్డెనింగ్‌ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు, రాయితీపై విత్తనాలు, సామగ్రి అందజేయటం ప్రారంభించింది. దీంతో ఆసక్తిదారులు పెరిగారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌, విల్లాల్లోని కొద్దిపాటి స్థలాన్ని, డాబాలను సేంద్రియ సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెరిగింది. సమయమూ కలసిరావటంతో ఆరు నెలల వ్యవధిలోనే మిద్దెసాగు గణనీయంగా పెరిగినట్టు ఉద్యానశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో సుమారు 25,000-30,000 కుటుంబాలు మిద్దెపంటలు పండిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రధాన పట్టణాలు/నగరాల్లో సుమారు 2-2.5 లక్షల కుటుంబాలు సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటల పెంపకం సాగిస్తున్నారు.

ఇంటి సాగుకు మాట సాయం!

మిద్దె పంట సాగుపై అనుమానాలను నివృత్తి చేసేందుకు పలువురు అనుభవజ్ఞులు, నిపుణులు సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకొస్తున్నారు.

ఇదీ చూడండి: రేపే రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.