ETV Bharat / city

కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియా మాట్లాడొచ్చని హైకోర్టు న్యాయమూర్తి డీవీఎస్​ఎస్​ సోమయాజులు స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి... ఎస్​ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు

author img

By

Published : Feb 18, 2021, 1:20 PM IST

ఆంధ్రప్రదేశ్​ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు స్పష్టం చేశారు. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని హైకోర్టు నిన్న తెలిపింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

నిన్న జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలు ఉంటాయి గానీ, వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు’ అన్నారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ సంస్థ అయిన ఎస్‌ఈసీని గౌరవించాలి. మంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో ఎస్‌ఈసీ అసమర్థులనే భావన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించాల్సి వచ్చింది’ అని తెలిపారు.

ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. నిరంతర స్ఫూర్తి రగిల్చే నినాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.