ఏపీలో తితిదే నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఉమ మహేశ్వర నాయుడు, పాలకవర్గంలో నేరచరితులపై భాజపా నేత భాను ప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు మరోసారి విచారణకు వచ్చాయి. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు తనను పాలకమండలి సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్.సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు అశ్వినీ కుమార్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపించగా.. జూన్ 20న తుది వాదనలు వింటామని విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష