ETV Bharat / city

లక్ష్మీ బ్యారేజీకి భారీగా ప్రవాహం.. గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ప్రాణహిత నది నుంచి గోదావరికి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డ) గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నారు. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంపు హౌస్‌ ద్వారా అన్నారం జలాశయానికి వచ్చే వారం నీటిని ఎత్తిపోసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణా పరివాహకంలో కూడా ప్రవాహం కొనసాగుతోంది.

heavy water flow to lakshmi barrage
లక్ష్మీ బ్యారేజీకి భారీగా ప్రవాహం.. గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
author img

By

Published : Jul 23, 2020, 8:29 AM IST

ప్రాణహిత నది నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది. రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద నదిలో 7.50 మీటర్ల మట్టం నమోదవుతోంది. 1.60 లక్షల క్యూసెకుల ప్రవాహం నమోదయింది.

దీంతో లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంపు హౌస్‌ ద్వారా అన్నారం జలాశయానికి వచ్చే వారం నీటిని ఎత్తిపోయనున్నట్లు సమాచారం. ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరు ద్వారా కాలువల నుంచి చెరువులను ఇప్పటికే నింపే ప్రక్రియ చేపడుతున్నారు.

ఈ లోగా ఎగువ నుంచి వరద రాకపోతే లక్ష్మీ నుంచి అన్నారం అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోయాలని భావిస్తున్నారు.శ్రీరామసాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా బుధవారం 1073.60 వరకు ఉంది. 36.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాకతీయ కాల్వ ద్వారా ఆరువేల క్యూసెకులకు పెంచి నీటిని విడుదల చేస్తుండగా, లక్ష్మీకాల్వ ద్వారా 100 క్యూసెకులు, అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా 720, గుత్ప ఎత్తిపోతల ద్వారా 270, తాగునీటికి 152 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం నుంచి 6654 క్యూసెకుల వరద నీరు వచ్చి చేరింది.

కృష్ణా పరీవాహకంలో..

మరోవైపు కృష్ణా పరీవాహకంలో పెద్దగా మార్పులేవీ లేవు. జూరాల నుంచి డెబ్బై మూడు వేల క్యూసెకులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి కూడా అంతే ప్రవాహం వస్తోంది.జూరాల జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ జూరాలలో 4.032 మిలియన్‌ యూనిట్లు, దిగువ జూరాలలో 4.522 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.

వరద మొదలైన నాటి నుంచి బుధవారం వరకు రెండు విద్యుత్తు కేంద్రాల్లో 27.255 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.శ్రీశైలం జలాశయం వద్ద 70 వేల క్యూసెకుల ప్రవాహం వస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి అనంతరం ఈ జలాశయం నుంచి నాగార్జున సాగర్‌వైపునకు 38 వేల క్యూసెకులు విడుదల చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఆశాజనకం: ప్రాజెక్టుల్లో జలకళ... అన్నదాత మోము కళకళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.