నైరుతి ప్రభావంతో హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో... ఇవాళ సాయంత్రంలోపు భారీ వర్ష సూచన ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు