ETV Bharat / city

వరణుడి ప్రకోపం.. అన్నదాతలకు శాపం

ఈసారి వానాకాలం సీజన్‌లో ఆది నుంచీ సమృద్ధిగా కురిసిన వానలు..చీడపీడల్లేకుండా ఏపుగా పెరిగిన పంటలు..ఆరుగాలం శ్రమించిన రైతన్నల్లో ఎన్నడూ లేని ఆశలను రేపాయి. ఇన్నాళ్లకు కాలం కలిసి వచ్చిందని..అప్పులు తీరి కష్టాలు గట్టెక్కుతాయని భావించేలా చేశాయి. లగ్గమైన దగ్గర నుంచి మెడలో పసుపుతాడుతో సర్దుకుపోయే ఇల్లాలికి ఈ దఫా బంగారు గొలుసు చేయించాలన్న కోరికను రేకెత్తించాయి. పెళ్లీడు కొచ్చిన కుమార్తెకు అప్పులు తేకుండా వివాహం చేయొచ్చన్న భరోసాను మోసుకొచ్చాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందాన రెండు రోజులు కురిసిన అతిభారీ వర్షాలు కర్షకుల ఆశలన్నింటినీ చిదిమేశాయి. పంటలను దెబ్బతీసి వారిని నిలువునా ముంచేశాయి. ప్రకృతిని నమ్ముకునే రైతన్నను సర్కారు సాయం కోసం ఎదురుతెన్నులు చూసేలా చేశాయి.

heavy crop loss in telangana due to heavy rains
ఆశల సాగుపై అశనిపాతం
author img

By

Published : Oct 16, 2020, 7:07 AM IST

కౌలు సొమ్ము కూడా రాదు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామంలో జానీ అనే రైతు 12 ఎకరాలను కౌలుకు తీసుకుని ఎన్నో ఆశలతో పత్తి సాగుచేశారు. ఎకరానికి రూ.12 వేల చొప్పున కౌలు కింద రూ.లక్షా 44 వేలు భూ యజమానికి చెల్లించారు. మరో రూ.3.60 లక్షలు పెట్టుబడి పెట్టారు. వర్షాలకు ఇలా పత్తి కాయలు నల్లబడి పంట నాశనమైందని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం కౌలుకు చెల్లించిన సొమ్మయినా తిరిగి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.4.50 లక్షలు అప్పు తెచ్చి పెట్టా

మొత్తం 15 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. ఇందులో ఏడున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నదే. పెట్టుబడి, కౌలు కలిపి ఇప్పటికే రూ.4.50 లక్షలు అప్పులు తెచ్చి ఖర్చుపెట్టాను. వర్షాలకు పంట మొత్తం నీటమునిగింది. ఆకులు ఎర్రబడి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే 80 శాతం పంట నాశనమైంది. ఎకరానికి 2 క్వింటాళ్ల పత్తి దిగుబడి కూడా వచ్చేలా లేదు. అప్పులే మిగిలేలా ఉన్నాయి.

- చిక్కొండ మల్లయ్య, చిల్వేరు, మిడ్జిల్‌ మండలం, మహబూబ్‌నగర్‌

వాతావరణం అనుకూలించడంతో బ్యాంకులు సరిగా రుణాలివ్వకపోయినా ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అనేక మంది రైతులు పంటలు సాగుచేశారు. ఎన్నో ఆశలతో అధికంగా కౌలు చెల్లించి పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలకు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. చివరికి తాజా వర్షాలతో అప్పులే మిగిలే దుస్థితి నెలకొందని..కంటికి రెప్పలా సాగును కాపాడుకుంటే వర్షం ముంచేసిందని రైతులు వాపోతున్నారు.

జూన్‌లో మొదలైన వర్షాలు అక్టోబరులో పంట చేతికొచ్చే సమయంలోనూ కురిసి కబళిస్తాయని ఊహించలేకపోయామని నల్గొండ జిల్లాకు చెందిన రైతు రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. గత జూన్‌ నుంచి ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. ఈ నెల 1 నుంచి 15 నాటికి సాధారణంకన్నా 143 శాతం అధికంగా వర్షాలు పడటం వల్ల పంట నష్టం అపారంగా ఉంది. నీటమునిగిన పైర్లలో చాలా వరకూ పంట దిగుబడి వచ్చేలా లేదని వ్యవసాయాధికారులు చెపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు వరద నీరు పొలాలపై ప్రవహించడం వల్ల పైర్లు నీటిధాటికి పాడయ్యాయి.

ఉదాహరణకు వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం బాచారం గ్రామంలో పత్తిచేల మీదుగా వరదనీరు వాగులోకి ప్రవహించడంతో పత్తిమొక్కలన్నీ బురదలో కూరుకుపోయి..నల్లగా మారి రైతులు పూర్తిగా నష్టపోయారు. పలు జిల్లాల్లో అనేక చోట్ల ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరిపైరు పొట్టదశలో, గింజలు గట్టిపడేదశలో నేలవాలడంతో తెగుళ్లబారిన పడి దిగుబడి పడిపోతుందని రైతులు భయపడుతున్నారు. వర్షాలకు పైర్లు నేలవాలి దెబ్బతినడం ఒక ఎత్తయితే, అంతంతమాత్రంగా మిగిలినవి తెగుళ్లబారిన పడకుండా కాపాడుకోవాలంటే ఖరీదైన పురుగు మందులు చల్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెపుతున్నందున మళ్లీ వాటికి పెట్టుబడి తలకు మించిన భారంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మెడ విరుపు తెగులు

వర్షాలు అధికంగా పడుతున్న ప్రాంతాల్లో వరి పైరుకు మెడ విరుపు తెగులు వ్యాపిస్తుందని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు. దీన్ని నియంత్రించకపోతే కంకి విరిగిపోయి వరి ధాన్యం దిగుబడి రాదు. చాలా ప్రాంతాల్లో సోయాచిక్కుడు పంట కోత దశలో ఉంది. ఈ చేలలో నీరుంటే పంట నల్లబడి సరైనధర రాదని ఆయన స్పష్టం చేశారు.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఇప్పగూడెం గ్రామ రైతు గొడిశాల యాదగిరి ఆరున్నరెకరాల్లో వరి పంట వేశారు. మరో నెల రోజుల్లో పంటను అమ్మి కుమార్తె పెళ్లి చేద్దామనుకుని నిశ్చితార్ధం కుదుర్చుకున్నాడు. ఈలోగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకి ఐదు ఎకరాల ముప్పై గుంటల పంటంతా నేలమట్టమై నీట మునిగింది. పంట సాగుకు దాదాపు రూ.1.20 ఖర్చు అయిందని, దిగుబడి ఏమీరాదని తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పంట నష్టం చెల్లించాలని వేడుకున్నాడు.

పత్తి, చెరకు నాశనం..

పత్తి, చెరకు చెరో 8 ఎకరాల్లో సాగుచేశాను. అధిక వర్షాలతో రెండు పంటలూ దెబ్బతిన్నాయి. చెరకు పంట నేలవాలి పాడయింది. పత్తి పూత, కాత రాలిపోయి నల్లబడుతోంది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేస్తే కనీస ఖర్చులైనా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. రెండు పంటలు వేస్తే ఏదో ఒకటైనా ఆదుకుంటుందంటే ఏదీ మిగల్లేదు.

- సత్యనారాయణ, ఆత్మకూరు గ్రామం, సదాశివపేట, సంగారెడ్డి జిల్లా

మూడుసార్లు పంట వేస్తే వర్షార్పణం

జూన్‌లో వానాకాలం పంట కింద 4 ఎకరాల్లో పత్తి వేస్తే వర్షాలకు కొట్టుకుపోయింది. మళ్లీ జులైలో పెసర, కంది వేస్తే అదీ వానలకు నాశనమైంది. చివరికి మూడోసారి మిరప సాగుచేస్తే గత రెండు రోజుల వర్షాలకు పాడైంది. మూడు పంటలకు ఇప్పటి వరకూ రూ.70 వేలు అప్పు తెచ్చి పెడితే ఒక్క పంటా దక్కలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- బీరప్ప, గాజీపూర్‌ గ్రామం, పెద్దేముల్‌ మండలం, వికారాబాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.