ETV Bharat / city

డెంగీ నివారణలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి హరీశ్​రావు

author img

By

Published : Jul 31, 2022, 12:41 PM IST

Harishrao on Dengue Prevention: డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంత్రి తన ఇంటిలోని పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు.

Harishrao
Harishrao

Harishrao on Dengue Prevention: ఇటీవల వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా డెంగీ కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని వైద్య ఆర్యోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారం, నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

డెంగీ నివారణలో భాగంగా మంత్రి హరీశ్ రావు తన ఇంటి పరసరాలను స్వయంగా శుభ్రపరిచారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్న మంత్రి... ఇంట్లోకి దోమలు రాకుండా చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలలో ఉన్న నీటిని తొలగించి వాటిని శుభ్రపరిచారు. ప్రజలంతా ఇంటిలో ఉన్న అన్ని నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగీకి ప్రధాన కారణమన్న మంత్రి... డెంగీని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.