ETV Bharat / city

వర్క్‌ ఫ్రం హోం భారం.. చేయకుంటే కొలువుకు గండం

author img

By

Published : Nov 2, 2020, 6:17 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని... అనగానే తొలుత ఎగిరి గంతేసిన ఐటీ ఉద్యోగులు ఇప్పుడు పనిభారం మోయలేక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరి ఉద్యోగాలు ఊడిపోగా.. పనిచేస్తున్న ఉద్యోగులపై రెండింతల భారం పడింది. రోజుకి సగటున ఒక్కో ఉద్యోగి 12 గంటలకు పైగా పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఐటీ ఉద్యోగుల్లో నడుం, మెడనొప్పి, మోకాలి కీళ్లనొప్పులు, కంటిచూపు మందగించడం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

health issues with work from hom
వర్క్‌ ఫ్రం హోం భారం

కరోనా సమయంలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కొందరు ఉద్యోగులను తొలగించాయి. ఉన్న ఉద్యోగులనే ఇతర ప్రాజెక్టుల్లోకి సర్దుబాటు చేశాయి. ఫలితంగా ప్రతి ప్రాజెక్టులో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. పనిచేస్తున్న ఉద్యోగులపైనే అదనపు భారం పడుతోంది. గతంలో వారానికి 40 గంటలు పనిచేస్తే, ఇప్పుడు రోజుకు సగటున 12 నుంచి 14 గంటలు శ్రమిస్తున్నారు.

ఒక్కో ఉద్యోగిది ఒక్కో వెత..

* ‘‘కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. రెండు నెలల పాటు అందరూ ఇంట్లోనే ఉంటూ ఎన్ని గంటలైనా పనిచేశారు. సంస్థలు ఇప్పుడూ ఎక్కువ సమయం పనిచేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.’’ అని సంతోష్‌ తెలిపారు.

* ‘‘మా స్నేహితురాలికి ఇప్పుడు ఎనిమిదో నెల. ఇంటి నుంచి పనివిధానంలో ఒకేచోట గంటల తరబడి కూర్చోవడంతో నీరసపడిపోయింది. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయడం కష్టమని ఉద్యోగం మానేయాలని నిర్ణయం తీసుకుంది.’’ అని నగరానికి చెందిన హర్షిణి పేర్కొన్నారు.

* ‘‘గతంలో ఏదైనా సమస్య తలెత్తినా, ఫిర్యాదు వచ్చినా వెంటనే పై ఉద్యోగి పరిష్కరించేవారు. ఇప్పుడు ఎందుకు పనిచేయరని బెదిరిస్తున్నారు. ఉదయం 8 - 9 గంటల మధ్య లాగిన్‌ అయితే లాగవుట్‌కు రాత్రి పది అవుతోంది’’ అని సాహితి వివరించారు.

* ‘‘ఇంటి నుంచి పని ఎంతో హాయి అనుకున్నారంతా.. కానీ, ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడానికీ అవకాశం లేకుండా పోయింది. భార్యాభర్తలు ఐటీ ఉద్యోగులైతే పిల్లలను పట్టించుకునే పరిస్థితి కరవైంది. అందుకే వారిని తల్లిదండ్రుల వద్దకు పంపించేస్తున్నారు. లేకుంటే వారినే ఇక్కడికి రప్పిస్తున్నారు’’ అని అనంత్‌రెడ్డి వివరించారు.

అప్రైజల్‌ సమయంలో చూస్తాం..

కార్యాలయాలకు వెళ్లినపుడు సమయం అయిపోగానే.. అత్యవసర కాల్స్‌ ఉంటే ఉన్నతోద్యోగులు బతిమిలాడేవారు. ఇప్పుడేమో ‘‘ఇంట్లోనే ఉన్నారు కదా.. ఏంచేస్తున్నార’’ని గద్దిస్తున్నారు. ఏ షిఫ్టు అయినా సరే 14 గంటలకు పైనే పనిచేయాల్సిన పరిస్థితి.. గట్టిగా మాట్లాడితే బృంద నిర్వాహకులు, ప్రాజెక్టు మేనేజర్లు ఏడాది చివరల్లో అప్రైజల్‌ సమయంలో సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు.

భవిష్యత్తులో ఇంటి నుంచి పని..

దేశీయ ప్రధాన కంపెనీలు ఇప్పటికే 90 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టినా భవిష్యత్తులో చాలా మందిని ఈ విధానంలోనే పనిచేయించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. దీనివల్ల కార్యాలయం అద్దెలు, విద్యుత్తు బిల్లులు, ఇతర ఖర్చుల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌ కంపెనీ 2025 నాటికి ఉద్యోగులు తమ పని గంటల్లో 25 శాతం మాత్రమే కార్యాలయాల్లో గడిపేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మైక్రోసాఫ్ట్‌ రానున్న 5-10 ఏళ్లలో 50 శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా ఉద్యోగులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.