తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాణిగంజ్ నుండి రసూల్‌పురా చౌరస్తా వరకు నూతనంగా ఏర్పాటుచేసిన వైట్ టాపింగ్ రోడ్డుకు ఇరువైపులా రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 4న దాదాపు రెండువేల మొక్కలను నాటి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్లో అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికల పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుకు..'