ETV Bharat / city

వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. ఆర్థిక సహాయం అందజేత - హైదరాబాద్‌లో వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్​

హైదరాబాద్‌లో వరద ప్రాంతాల్లో మగ్గుతూ ఇబ్బంది పడుతున్న బాధితులను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ధైర్యం చెప్పారు.

వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. ఆర్థిక సహాయం అందజేత

author img

By

Published : Oct 21, 2020, 10:39 PM IST

వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. ఆర్థిక సహాయం అందజేత

వరద ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు ప్రజాప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. లాలాపేటలో ఉపసభాపతి పద్మారావుగౌడ్ తో కలిసి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రామంతపూర్ బోడుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డిలతో కలిసి వరద బాధితులకు 10 వేల రూపాయల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. తర్వాత బర్కత్​పుర రత్నానగర్​లో పర్యటించిన మంత్రి.. నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

తలసాని పరామర్శ..

సనత్ నగర్‌లోని మెండామార్కెట్, రాంగోపాల్ పేట్, బేగంపేట్ డివిజన్లతో పాటు గాంధీనగర్‌ లోని అరుంధతీ నగర్‌లో వరద ముంపునకు గురైన బాధితులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అపార్ట్‌మెంట్లలో శానిటైజ్

శేరిలింగంపల్లి, మియాపూర్,‌ మదినాగూడలోని జనప్రియనగర్‌లో జీహెచ్​ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి పర్యటించారు. పలు కాలనీలు కలియ తిరిగారు. వరద తాకిడికి గురైన అపార్ట్‌మెంట్లలో శానిటైజ్‌ చేయించారు. బషీర్‌బాగ్‌లోని కమేల బస్తీలో వర్షాల కారణంగా కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పరిశీలించారు. బాధితులతో మాట్లాడిన దానం.. అత్యవసర సహాయం కింద 8 కుటుంబాలకు పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

వరద ప్రాంతాల్లో ఇక్కట్లు పడుతున్న బాధితులకు ఇతర పార్టీల నేతలు సైతం సహాయం చేస్తున్నారు. కర్మాన్‌ఘాట్‌లోని ఉదయ్‌నగర్‌లో భాజపా నాయకులు ఆహారం, పాల ప్యాకెట్లు వితరణ చేశారు.

ఇవీ చూడండి: తెరుచుకున్న జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు తూము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.