ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగిద్దామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. దీపం వెలిగించడం ద్వారా కరోనా వైరస్‌పై మూకుమ్మడి పోరుకు సంకేతంగా నిలుద్దామని అన్నారు.
రేపు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్‌లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల ద్వారా దీపాలు వెలిగించాలని అన్నారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు. రోడ్లపైకి రాకుండా ఇంటి ద్వారాలు, బాల్కానీల వద్దే దీపాలు వెలిగించాలని సూచించారు.
ఇదీ చూడండి: లైట్స్ ఆపితే పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందా?