ETV Bharat / city

shock to officers: ఆ శాఖలోని అధికారులకు ఏపీ ప్రభుత్వం షాక్..!

Shock to officers: ఏపీలో ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండటంతో ప్రస్తుత మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని మాతృశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Shock to officers
Shock to officers
author img

By

Published : Apr 7, 2022, 3:23 PM IST

Shock to officers: ఈ నెల 11న ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండటంతో ప్రస్తుత మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని మాతృశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఓఎస్డీలు, పీఎస్, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ పేరెంట్ డిపార్ట్​మెంట్​లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.

సదరు అధికారి, లేదా ఉద్యోగి.. తిరిగి మంత్రుల వద్దే పని చేయాలని ఆదేశిస్తే మాతృశాఖతో పాటు సదరు మంత్రుల నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు జరిగిన ఉద్యోగుల పదోన్నతులు, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఇతర సర్వీసు అంశాలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లనే నోడల్ అధికారులుగా నియమించింది.

ఇదీ చదవండి: ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.