ETV Bharat / city

లాక్​డౌన్​ 2.0: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం

author img

By

Published : May 19, 2021, 3:13 PM IST

Updated : May 19, 2021, 4:25 PM IST

PETROL
Government grants exemption to petrol banks in villages and towns in the state

15:03 May 19

లాక్​డౌన్​ 2.0: పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం

రాష్ట్రంలో జోరుగా సాగుతున్న పంట నూర్పిళ్లు, ఇతర వ్యవసాయ పనులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్‌ పంపులకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఉండగా... మిగిలిన అన్ని పెట్రోల్‌ పంపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అవకాశం కల్పించారు. 

రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న ఈ సమయంలో పెట్రోల్‌ పంపులు మూసివేత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లో పెట్రోల్‌ పంపులు సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు ఇచ్చింది. దాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం లాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఇదీ చూడండి: గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ సేవలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Last Updated : May 19, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.