ETV Bharat / city

కరోనా సెకండ్​ వేవ్ ప్రభావం... ప్రభుత్వ ఉద్యోగులపై పంజా - corona cases in hyderabad

కొవిడ్ కల్లోలం అందరిలోనూ కలవరం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో... భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్‌లోనూ పలువురు ఉద్యోగులు మహమ్మారి బారిన పడ్డారు. ఈ పరిణామంతో మిగతా ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే విధులకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

government employees effected to corona
government employees effected to corona
author img

By

Published : Apr 18, 2021, 3:50 AM IST

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. రెండో దశ ప్రభావం రాష్ట్రంపైనా తీవ్రంగానే ఉంది. కొవిడ్‌ విజృంభణ ప్రభావం.... ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులపైనా బాగానే పడింది. కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కొవిడ్‌ నిర్ధారణయింది.

పది రోజులుగా నిత్యం పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కో రోజు రెండంకెల సంఖ్యలోనూ పాజిటివ్‌గా తేలుతోంది. ధీర్ఘకాలిక వ్యాధులున్న ఓ ఉద్యోగి కరోనాతో మరణించారు. బీర్కే భవన్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్​ సిబ్బందిలోనూ పలువురు మహమ్మారి బారినపడ్డారు. దాదాపుగా 60మందికి పైగానే కరోనా సోకినట్లు సమాచారం. వివిధ శాఖల కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. తీవ్రత దృష్ట్యా మంత్రులు, ఉన్నతాధికారులు పలువురు కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

సహచరులకు వ్యాధి నిర్థారణ అవడంతో మరికొందరు హోంఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు బోసిపోయి కనిపిస్తున్నాయి. విధులకు హాజరయ్యే ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కేసుల దృష్ట్యా తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఎక్కువ మంది కార్యాలయంలో ఉంటే అందరికీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. కొంత మంది సిబ్బందే విధులకు హాజరయ్యేలా చూడాలని కోరుతున్నారు.

రోజు విడిచి రోజు విధులకు హాజరవడం, వీలైతే ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించడం లాంటి ప్రత్యామ్నాయాలు చూడాలంటున్నారు. వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పరిస్థితులు చేయి దాటకముందే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఆసరా పింఛన్లకు రూ. 11 వేల 508 కోట్లు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.