ETV Bharat / city

క్లినికల్ ట్రయల్స్ కోసం ఎథికల్‌ కమిటీ ఏర్పాటు

ప్లాస్మా థెరపీ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దశాబ్దాలుగా మనుగడలో ఉన్నా... ఈ పదానికి బాగా ప్రాచుర్యం కలిగింది మాత్రం గత నెలరోజుల్లోనే. భారత్ సహా వివిధ దేశాల ఆశలన్నీ ప్రస్తుతం ఈ చికిత్సపైనే. కరోనాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ప్లాస్మాథెరపీని వజ్రాయుధంగా భావిస్తున్నాయి. అసలు ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? కరోనాను ఎదుర్కొనేందుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ప్లాస్మా థెరపీ నిజంగా సంజీవని వంటిదేనా? వైరస్‌ సోకిన రోగులకు ప్లాస్మా థెరపీ నిర్వహించటం సాధ్యమేనా?

plasma therapy
క్లినికల్ ట్రయల్స్ కోసం ఎథికల్‌ కమిటీ ఏర్పాటు
author img

By

Published : Apr 17, 2020, 8:01 PM IST

క్లినికల్ ట్రయల్స్ కోసం ఎథికల్‌ కమిటీ ఏర్పాటు

ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకురావటం ఒక్క రోజులో అయ్యే పని కాదు. అందుకు భారీగా పరిశోధనలు జరగాలి. కనీసం ఏడాది రెండేళ్లు పట్టే అకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో.. గుడ్డిలో మొల్ల నయం అన్న చందంగా ప్రస్తుత ప్రపంచమంతా ప్లాస్మా థెరపీపైనే ఆశలు పెట్టుకుంది.

ఆశలన్నీ దీనిపైనే..

చైనాలో ఈ చికిత్స మెరుగైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా, అమెరికా, యూకే వంటి దేశాలు ఈ చికిత్సపై ఆశలు పెట్టుకున్నాయి. అందుకు తగిన ప్రయోగాలను వేగవంతం చేశాయి. ఇదే అడుగుజాడల్లో నడుస్తున్న భారత్.... క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు ఉపక్రమించింది. అయితే ఈ ప్రయోగం ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ ప్రొటోకాల్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది.

ప్లాస్మాథెరపీ అంటే..

సాధారణంగా మనిషి శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు.. శరీరంలో ఉండే సహజ రక్షణ విభాగం యాంటీ బాడీలను విడుదల చేసి ఆయా క్రిములను చంపేస్తుంది. దీనినే ఇమ్యూనిటీ అంటాం. అయితే కరోనా నేరుగా ఇమ్యూనిటీ మీదే పనిచేస్తోందని, ఫలితంగా దీనికి తగిన యాంటీ బాడీలు తయారుకావడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారై ఉంటాయి. వాటిని సేకరించి రోగి శరీరంలోకి పంపినప్పుడు 3 నుంచి 5రోజుల్లోపే వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంది. దీనినే ప్లాస్మా థెరపీ అంటారు.

ఎథికల్ కమిటీ ఏర్పాటు..

రాష్ట్రంలోనూ ప్రయోగాలు చేసేందుకు అనుమతులను సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు వైద్యుల బృందంతో కూడిన ఎథికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీఎంఆర్, ఎథికల్ కమిటీల నుంచి వీలైనంత త్వరగా ప్లాస్మాథెరపీ క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతులు తీసుకువచ్చేందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కమిటీ సభ్యులను కోరింది. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 180కి పైగా ఉన్నందున.. సీసీఎంబీ వంటి ల్యాబ్‌లు అందుబాటులో ఉన్న తరుణంలో ఈ తరహా ప్రయోగాలను చేస్తే రోగులకు వీలైనంత త్వరగా చికిత్స అందించవచ్చని భావిస్తోంది.

ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.