ఆర్టీసీ కార్మికులను ఇక నుంచి ఉద్యోగులుగా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఈనెల 1న నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఇకపై వివిధ వేదికలపై ప్రసంగించేటప్పుడు ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని సర్క్యులర్లో స్పష్టం చేశారు. డిపో, యూనిట్ నోటీసు బోర్డులలో అధికారికంగా ఉద్యోగులుగా పేర్కొనాలని సూచించారు. టీఎస్‌ఆర్‌టీసీలోని అన్ని యూనిట్లలోని అధికారులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ఆర్టీసీ ఇన్ఛార్జీ ఎండి సునీల్ శర్మ ఆదేశించారు.
ఇదీ చూడండి: మద్యం ధరల పెరుగుదల... సర్కారు ఖజానాకు భారీ ఆదాయం