ETV Bharat / city

'భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిపించండి'

author img

By

Published : Jun 27, 2020, 12:46 PM IST

ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ... గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సిన్హా కమిటీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

good governance organization secretery padmanabha reddy letter to governer
'భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిపించండి'

ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. సిన్హా కమిటీ నివేదిక ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సిన్హా కమిటీ... ఇబ్రహీంపట్నంలో 145 ఎకరాల భూదాన్​ భూముల కేటాయింపులు రద్దు చేయాలని సూచించింది. నివేదిక ఇచ్చి నాలుగేళ్లైనా... చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. సిన్హా కమిటీని కొనసాగించి అక్రమ భూ కేటాయింపులపై విచారణ జరిగేలా చూడాలని కోరారు.

ఇదీ చూడండి: మోదీ విమానాన్ని మిసైల్స్​ కూడా ఢీకొట్టలేవా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.