గోదావరి బోటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన వరంగల్ జిల్లా వాసులు.. తూర్పు గోదావరి కలెక్టర్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని తెలిపారు. ఈ ఘటనలో తమ బంధువులు 15 మంది యాత్రకు రాగా, 9 మంది మృతిచెందారని తెలిపారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమవగా... మరో ముగ్గురు గల్లంతయ్యారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ధైర్యం చెప్పిన కలెక్టర్.. ప్రస్తుతం ధృవపత్రాల పరిశీలన జరుగుతోందని బదులిచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల కాగానే.. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి