త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఏటా ముస్లింలు జీవాలను కొనుగోలు చేసి కుర్బాని చేస్తుంటారు. కుర్బానీలో భాగంగా జీవాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భాగం బంధువులకు, మరో భాగం పేదవాళ్లకు.. మూడో భాగం కుటుంబసభ్యులు తీసుకుంటారు. కానీ కొవిడ్ దృష్ట్యా కుర్బానీ చేసేందుకు ముస్లింలు వెనకాడుతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు. కుర్బానీ చేసినా వాటిని పంచాలంటే... కొవిడ్ భయం వెంటాడుతున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు.
గతేడాదితో పోల్చితే...
పెరిగిన ధరలు
కుర్బానికి ఏడాది పైబడిన జీవాలనే వినియోగిస్తారు. పోయిన ఏడాది.. సంవత్సరం పైబడిన జీవాలకు రూ.8వేలు పలికాయి. కానీ ఈ ఏడాది మాత్రం సుమారు వాటి ధర రూ.పదివేల వరకు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే పొట్టేళ్ల బరువును బట్టి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. జీవాల రవాణా తగ్గినా ధరలు మాత్రం పెరిగాయని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: మానవతా బంధాలను తుంచేస్తున్న కరోనా..