ETV Bharat / city

నాడు ఏకగ్రీవ జోరు.. నేడు పోరు! - ghmc deputy mayor election 2021

హైదరాబాద్​లో డివిజన్ల పునర్విభజన జరిగినప్పట్నుంచి వరుసగా ముగ్గురు మేయర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 150 డివిజన్లకు 2009 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా ముగ్గురు మేయర్లు పనిచేశారు. పునర్విభజన అనంతరం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌, ఎంఐఎం మేయర్‌ పీఠాన్ని పంచుకున్నాయి.

ghmc-mayor-and-deputy-mayor-election-2021
జీహెచ్​ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
author img

By

Published : Feb 10, 2021, 9:51 AM IST

తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2016 జరిగిన బల్దియా పోరులో అధికార తెరాస పార్టీ 99 స్థానాలతో మేయర్‌ను ఏకగ్రీవం చేసుకుంది. ఈసారి ఎన్నిక మాత్రం ఏ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకోలేని రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈసారి మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం కాకపోవచ్చని తెలుస్తోంది.

2009లో ఇద్దరు మేయర్లు..

చివరి నిమిషం వరకు మేయర్‌ అభ్యర్థి ఎవరో తెలియదు. దిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్లో ఎవరి పేరుందో తెలియక కాంగ్రెస్‌తోపాటు మిగిలిన పక్షాలూ ఉత్కంఠగా ఎదురు చూశాయి. 2009 డిసెంబర్‌ 4న జరిగిన మేయర్‌ ఎన్నిక నాటి పరిస్థితి అది. అనూహ్యంగా అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా తార్నాక కార్పొరేటర్‌ బండ కార్తీక రెడ్డి తెరపైకి వచ్చారు. ఎంఐఎం మద్దతుతో జూబ్లీహాల్‌లో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రిసైడింగ్‌ అధికారి నవీన్‌మిట్టల్‌ మేయర్‌గా కార్తీకరెడ్డి, ఉపమేయర్‌గా జాఫర్‌ హుస్సేన్‌ మిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అప్పట్లో కాంగ్రెస్‌-ఎంఐఎం మేయర్‌ పదవిపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానిప్రకారం మొదటి రెండేళ్లు కాంగ్రెస్‌కు, తదుపరి రెండేళ్లు ఎంఐఎంకి, చివరి ఏడాది కాంగ్రెస్‌కు మేయర్‌ పదవి ఉండాలి. కానీ అలా జరగలేదు. బండ కార్తీక రెడ్డి మేయర్‌ పదవికి రాజీనామా చేశాక 2012 జనవరి 3న మాజిద్‌ హుస్సేన్‌ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పాలకమండలి గడువు ముగిసే వరకు పదవిలో ఉన్నారు.

2016లో అరగంటలోనే ప్రక్రియ పూర్తి..

తెలంగాణ ఏర్పడ్డాక 2016 ఎన్నికల్లో తెరాస 99 డివిజన్ల ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 11న నిర్వహించిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్‌, ఉపమేయర్‌ ఏకగ్రీవం అరగంటలోనే ముగిశాయి. సమావేశానికి 150 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. 23 మంది ఎక్స్‌అఫిషియోలు గైర్హాజరయ్యారు.

193 మంది ప్రజాప్రతినిధులతో ‘మహా’సభ!

పేరుకు తగ్గట్లే హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పరిమాణంలో రాష్ట్ర శాసనసభకన్నా పెద్దది. గురువారం జరగబోతోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపితే శాసనసభలో 120 మంది సభ్యులుంటే ఎక్స్‌అఫిషియోలతో కలిపి జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో 193 మంది సభ్యులున్నారు. అందులో 149 మంది కార్పొరేటర్లు అయితే ఎక్స్‌అఫిషియోల హోదాలో ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 21 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు. బల్దియాలో 150 డివిజన్లు ఉంటే లింగోజిగూడ కార్పొరేటర్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో సంఖ్య 149కి తగ్గింది. అందులో తెరాస కార్పొరేటర్లు 56, భాజపా 47, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరున్నారు. వీరు గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని 213 కుర్చీల సామర్థ్యం గల కౌన్సిల్‌హాల్‌లో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటారు.

మేయర్‌ పోటీలో మేమూ ఉన్నాం: భాజపా

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు మేమూ పోటీ పడుతున్నామని భాజపా స్పష్టం చేసింది. ఈమేరకు పార్టీ విప్‌ను కూడా జారీ చేయబోతోంది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు ఎన్‌.రామచంద్రరావు వెల్లడించారు. గ్రేటర్‌ ప్రజలు తమకు మేయర్‌ పదవి కట్టబెట్టాలనే 48 డివిజన్లలో విజయాన్ని అందించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో భాజపా కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినాయకత్వం బుధవారం సమావేశమై మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి వస్తారు.

పార్టీల వారీగా ఎక్స్‌అఫిషియోలు, కార్పొరేటర్లు..

తెరాస..

ఎమ్మెల్యేలు.. 13

ఎమ్మెల్సీలు.. 13

రాజ్యసభ సభ్యులు.. 6

కార్పొరేటర్లు.. 56

ఎంఐఎం

ఎమ్మెల్యేలు.. 7

ఎమ్మెల్సీలు.. 2

లోక్‌సభ సభ్యులు.. 1

కార్పొరేటర్లు.. 44

భాజపా

ఎమ్మెల్యే.. 1

లోక్‌సభ సభ్యులు.. 1

కార్పొరేటర్లు.. 47

కాంగ్రెస్‌

కార్పొరేటర్లు.. 2

(ఎక్స్‌అఫిషియోలు లేరు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.