ఎటువంటి దరఖాస్తు చేయకుండానే జనన ధ్రువపత్రాన్ని మంజూరు చేసే విధానాన్ని జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తెస్తోంది. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుల వివరాలను వైద్యులు ధ్రువీకరించి సంబంధిత సర్కిల్ కార్యాలయానికి చేరవేస్తే బల్దియా ఆమోదిస్తుంది. ధ్రువపత్రం మంజూరైనట్లు తల్లిదండ్రులకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లోని నంబరు చూపించి రాష్ట్రంలోని అన్ని మీసేవ కేంద్రాల్లో ముద్రించుకోవచ్ఛు మరణ ధ్రువపత్రాల మంజూరూ ఇలానే ఉండనుంది.
60 రోజులు దాటితే వేటే..
ఆసుపత్రులు ధ్రువీకరించిన జనన, మరణాలను అధికారులు ఆమోదించారా, లేదా అనే విషయాన్ని కమిషనర్, అదనపు కమిషనర్ తెలుసుకొంటారు. వారం, 15, 30, 60 రోజులపాటు ఆమోదానికి నోచుకోకపోతే వివరణ కోరతారు. 60 రోజులు దాటితే సదరు అధికారిపై వేటు వేస్తారు.
పేరు పెట్టకపోతే..
జనన ధ్రువపత్రాలు శిశువు పేరు లేకుండా ఉంటాయి. అవసరమైతే తల్లిదండ్రులు ఆ ధ్రువపత్రాన్ని ముద్రించుకోవచ్ఛు లేదంటే..ఏడాదిలోపు పేరు చేర్చాలని ఎలాంటి అదనపు దస్త్రాలు అక్కర్లేకుండా దరఖాస్తు పెట్టుకోవచ్ఛు
ఆ వివరాలే ప్రామాణికం
పౌరులు దరఖాస్తు చేసేవరకు ఆగకుండా..వైద్యులిచ్చిన జనన, మరణాల వివరాలను నేరుగా ఆమోదించి ధ్రువపత్రాలు మంజూరు చేయబోతున్నాం. ఇంటి దగ్గర, ఇతర ప్రాంతాల్లో జరిగిన జనన, మరణాల నమోదు ప్రస్తుతం మాదిరే క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా జరగనుంది.
-డి.ఎస్.లోకేష్‌కుమార్, కమిషనర్, జీహెచ్‌ఎంసీ
- ఇదీ చూడండి : నేటి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం