ETV Bharat / city

Gandhi Hospital Rape: గాంధీ ఘటనపై వీడిన మిస్టరీ.. అక్కాచెల్లెల్లపై ఆత్యాచారం కల్పితమే..!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార ఆరోపణల కేసులను... పోలీసులు చాకచక్యంగా చేధించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత, వైద్య నివేదికల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రెండు కేసుల్లోనూ అత్యాచారం జరగలేదని తేల్చారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఫిర్యాదు చేసిన మహిళ మానసికస్థితి సరిగ్గా లేదని స్పష్టం చేశారు. సంతోష్‌నగర్ కేసులో... యువతి తన ప్రియుడి సానుభూతి పొందాలనే... సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేల్చారు.

Gandhi Hospital Rape issue and santhosh nagar rape case both are Fictions

author img

By

Published : Aug 20, 2021, 4:56 AM IST

Updated : Aug 20, 2021, 6:24 AM IST

హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం కేసు మిస్టరీ వీడింది. అనారోగ్యంతో ఉన్న బావకు సాయంగా వచ్చిన తనపై, తన అక్కపై సామూహిక అత్యాచారం చేశారంటూ.... మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగురోజులపాటు విచారించిన పోలీసులు... అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. ముందుగా చెల్లెలు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా... ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకున్నారు. వైద్య నివేదికలోనూ అత్యాచారం జరగలేదని తేలింది. గాంధీ ఆస్పత్రి రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని... సూపరింటెండెంట్‌ రాజారావుకు పోలీసులు తెలిపారు.

ఆమె ఇష్టంతోనే సెక్యూరిటీ గార్డుతో...

చెల్లెల్ని ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకుంది. మహిళలిద్దరికీ కల్లు తాగే అలవాటుందని... మూడ్రోజులుగా కల్లు దొరకకపోవడంతో వాళ్లిద్దరూ ఆస్పత్రి వార్డులోంచి బయటకి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్క ఆస్పత్రి నుంచి బయటకి వెళ్లగా... చెల్లెలు దవాఖానా ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. అక్కడే చెల్లికి ఒక సెక్యూరిటీ గార్డు పరిచయమయ్యాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన క్రమంలో 15వ తేదీ తెల్లవారుజామున... ఒంటిపై దుస్తులు లేని స్థితిలో చెల్లెలు ఆస్పత్రి ఆవరణలో ఉంది. ఆమె గురించి ఉమామహేశ్వర్‌ రోగికి ఫోన్‌ చేసి చెప్పడంతో... అతని కుమారుడు ఆస్పత్రికి వచ్చి యువతిని తీసుకెళ్లాడు. బంధువులు ఏం జరిగిందని ప్రశ్నించగా... అక్క ఇంటికి రాలేదన్న భయంతో... అత్యాచారం కథ అల్లిందని పోలీసులు వెల్లడించారు.

అందులోనూ నిజం లేదు..

సంతోష్‌నగర్‌లో ఆటోను దారి మళ్లించి తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ... ఓ యువతి చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆమె చెప్పిన అంశాలు నిజం కాదని తేల్చారు. సామూహిక అత్యాచారానికి సంబంధించి వైద్య, సాంకేతిక, సమాచార అంశాలు ఒక్కటి కూడా తేలలేదని గుర్తించారు. తనను కాదని మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్న ప్రియుడి సానుభూతి పొందడానికే... యువతి ఇదంతా చేసిందని తేల్చారు.

రెండూ కల్పితాలే..

రెండు కేసుల్లోనూ పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి నిజాలను రాబట్టారు. అత్యాచార ఆరోపణలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో భాగంగా సాంకేతికతను, వైద్యుల నివేదికను బట్టి అవాస్తవాలు అని తేల్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లు... పోలీసుల దర్యాప్తు వల్ల తప్పు చేయలేదనే విషయం బయటపడింది.

ఇదీ చూడండి:

Gandhi hospital rape issue: 'గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణలు అవాస్తవం'

Last Updated : Aug 20, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.