ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్ నగరానికి రానున్న ఐదేళ్లలో రూ.1,939 కోట్ల అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు రానున్నాయి. మిలియన్ ప్లస్ నగరాల జాబితాలో భాగంగా భాగ్యనగరానికి నిధులు అందనున్నాయి.
సంవత్సరం | ఘనవ్యర్థాల నిర్వహణకు | వాయు నాణ్యత కోసం |
2021-22 | రూ.236 కోట్లు | రూ.118 కోట్లు |
2022-23 | రూ.245 కోట్లు | రూ. 122 కోట్లు |
2023-24 | రూ.259 కోట్లు | రూ.129 కోట్లు |
2024-25 | రూ.274 కోట్లు | రూ.137 కోట్లు |
2025-26 | రూ.278 కోట్లు | రూ.140 కోట్లు |
మొత్తంగా ఐదేళ్లలో ఘనవ్యర్థాల నిర్వహణకు 1293 కోట్లు, వాయు కాలుష్య నియంత్రణకు 646 కోట్ల రూపాయలు ఆర్థికసంఘం సిఫారసుల ద్వారా హైదరాబాద్ కు అందనున్నాయి.
ఇవీచూడండి: 'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'