నేర పరిశోధనల్లో రాజకీయం జోక్యం ఉండకూడదని పలువురు న్యాయ నిపుణులు, మాజీ పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి గత 40 ఏళ్లుగా ఎన్నికమిటీలు వేసినప్పటికీ... ఇంత వరకు అవి అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాశ్ నారాయణ స్థాపించిన 'ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీ-ఫామ్స్' రెండో విడత జాతీయ సదస్సు నిర్వహించారు. 'చట్టబద్ధ పాలన-సంస్కరణలు' అనే అంశంపై వర్చువల్గా చర్చ జరిగింది.
రెండో రోజున 'దర్యాప్తు-విచారణ'ను బలోపేతం చేయడం అనే అంశంపై సదస్సులో చర్చించారు. 1859 నాటి చట్టంతో మన వ్యవస్థ పతనమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ నియామకంలో రాజకీయ జోక్యం వల్ల దోషులు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. నేరాలు చేస్తే తక్కువ రిస్క్ ఎక్కువ లాభం అనే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో 21వ లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్, ఏపీ మాజీ డీజీపీ సీ. ఆంజనేయరెడ్డి, సెంట్రల్ బ్యూరో విచారణ డైరెక్టర్ కార్తికేయన్, ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎల్ తహలియాని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్