హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని ఆబ్కారీ శాఖ స్వాధీనం చేసుకుంది. నాంపల్లిలోని ఓ ట్రావెల్స్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు విదేశీ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ కేసులో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి తెలిపారు.
ప్రాథమిక విచారణలో మరో ఇద్దరు అనిల్, ఖలీద్ పేర్లు బయటకొచ్చినట్లు పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షలు విలువ చేసే మద్యం సీసాలను, రూ. 2 లక్షల నగదు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కొంత మొత్తంలో మద్యం అక్రమ రవాణ చేస్తున్నట్లు గుర్తించాలని అధికారులు తెలిపారు. చైన్నై నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేటు ట్రావెల్స్‌లో తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు గతంలో రెండుసార్లు అరెస్టయినట్లు తెలిపారు.
ఇవీచూడండి: పొదుపు డబ్బులను దోచుకెళ్లిన దొంగలు