వర్షం నగరవాసి జీవితాన్ని అతలాకుతలం చేసింది. సికింద్రాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి బేగంపేట్ ప్రకాశ్ నగర్‌లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మోకాళ్లలోతు వరకు నీళ్లు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసరాలు, సామగ్రి పూర్తిగా కొట్టుకుపోయాయి. ప్రకాశ్ నగర్‌లోని ఎక్స్‌టెన్షన్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చేరడం వల్ల కార్లు, ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి.
మల్కాజ్‌గిరిలో మోకాలి లోతు వరద నీరు
నగర శివారులోని మల్కాజ్‌గిరి ఎన్‌ఎండీసీ కాలనీలో మోకాలి లోతు వరద నీరు చేరింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలోకి వెళ్లలేక రోగులు బయటే ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా వరద నీటిలో రాలేమని చెప్పినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.