Polavaram: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంత రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టు స్పిల్వేలోని 48 రేడియల్ గేట్ల వద్ద భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులు మొత్తం గేట్లు ఎత్తారు.
స్పిల్వే వద్ద ప్రస్తుత నీటిమట్టం 29 మీటర్లకు చేరుకోగా.. 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం దిగువకు విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఎగువ నదీ తీర ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వరదల కారణంగా ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: