Jinnah Tower: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా... మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరులో జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు.
జిన్నా టవర్ పేరు మార్చాలని భాజపా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టవర్‌కు జాతీయ పతాకం రంగులను వేసి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచాల్సిన పాలకులు.. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని సుచరిత తెలిపారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.