ETV Bharat / city

Field Assistants Arrested : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టు - అసెంబ్లీ ముట్టడికి ఫీల్డ్ అసిస్టెంట్ల యత్నం

Field Assistants Arrested: 14 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించిన తమను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరిలో పది మందిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

Field Assistants Arrested
Field Assistants Arrested
author img

By

Published : Mar 12, 2022, 2:40 PM IST

Field Assistants Arrested : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Field Assistants Arrested at Assembly : 14 ఏళ్లు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేసిన తమను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక కుటుంబంతో సహా వీధినపడ్డామని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"మా గోడు చెప్పుకోవడానికి మేం అసెంబ్లీ వద్దకు వచ్చాం. కానీ సీఎం కేసీఆర్ మాకు సమయం ఇవ్వడం లేదు. కనీసం కలిసే అవకాశం కల్పించడం లేదు. ఇక మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. 14 ఏళ్లు పని చేసిన మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించారు. మాకు ఏ పని చేయాలో అర్థం కావడం లేదు. కుటుంబంతో సహా వీధిన పడ్డాం. ఉపాధి లేదు. చేయడానికి పని లేదు. ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించాలి. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి."

- ఫీల్డ్ అసిస్టెంట్లు

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.