హైదరాబాద్ ఫలక్నూమ పీఎస్ పరిధిలో కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆస్మాబేగం అనే యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె వెన్నులోకి తూట దూసుకుపోయింది.
తూటా గుర్తించిన నిమ్స్ వైద్యులు
శనివారం అర్ధరాత్రి తీవ్రమైన వెన్నునొప్పి రావడం వల్ల కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ న్యూరోసర్జరీ యూనిట్ వైద్యులు ఎక్స్ రే తీసి పరిశీలించగా.. తూట కనిపించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల విషయం గోప్యంగా ఉంచిన తండ్రి
యువతిపై కాల్పులు జరిగిన విషయాన్ని ఆమె తండ్రి అబ్దుల్ గోప్యంగా ఉంచారు. దీనిపై స్పందించేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని.. డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
అసలు యువతిపై కాల్పులు ఎవరు జరిపారు... కారణమేంటి..? కుటుంబసభ్యులు విషయం ఎందుకు గోప్యంగా ఉంచారు..? అనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు