బాయిలర్ పేలడం వల్ల ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. బాలాపూర్ పీఎస్ పరిధిలోని సుల్తాన్ పూర్లోని ఓ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా... మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని వస్తువులు బయటకు ఎగిరిపడ్డాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.