ETV Bharat / city

మాంచెస్టర్ విద్యార్థికి కవిత సాయం.. ట్వీట్​కి స్పందన - Ex Mp kavitha Helps Nri Students

లాక్​డౌన్ కారణంగా లండన్​లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ద్వారా నిత్యావసర సరుకులు అందించారు.

Ex Mp kavitha Helps Nri Students
మాంచెస్టర్ విద్యార్థికి కవిత సాయం.. ట్వీట్​కి స్పందన
author img

By

Published : Apr 24, 2020, 7:16 AM IST

కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్​డౌన్ పాటిస్తున్నది. లండన్​లో లాక్​డౌన్​ అయి.. అక్కడే చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆరుగురు విద్యార్థులకు తెలంగాణ జాగృతి యూకే విభాగం ద్వారా నిత్యావసరాలు అందచేశారు. మాంచెస్టర్​లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్​షైర్​లో నిజామాబాద్, ఆర్మూరు, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంబీఏ చదువుతున్నారు. లాక్​డౌన్ కారణంగా రాష్ట్రానికి రాలేక అక్కడే ఉండిపోయారు. లండన్​లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, సాయం చేయాలని మాజీ ఎంపీ కవితకు ట్వీట్ చేశారు. ట్వీట్​ చూసి వెంటనే స్పందించిన కవిత విద్యార్థులకు అండగా ఉండాలని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్ బల్మూరికి సమాచారం అందించారు. పది గంటల్లోనే తెలంగాణ జాగృతి ప్రతినిధులు విద్యార్థుల వద్దకు చేరుకొని ధైర్యం చెప్పి.. నిత్యావసర సరుకులు అందచేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కవితకు, తెలంగాణ జాగృతి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీచూడండి: ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.