న్యాయస్థానాలకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కావాలంటే కోర్టు తీర్పులపై పై కోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ప్రతి తీర్పుపైనా అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆయన.. న్యాయమూర్తులపై కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు.
అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. కోర్టు తీర్పును విమర్శించే హక్కు పౌరులకు ఉందని అన్నారు.
ఇదీ చదవండి: వైకాపా ఎంపీ, మాజీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు నోటీసులు