గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. గ్రామ స్వరాజ్య స్థాపనపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సూచించారు. యువత ఆలోచనలను మంచి వైపు మరల్చి.. దేశ భవిష్యత్‌కు పునాది వేసే వారిగా తీర్చిదిద్దాలని వివరించారు. హైదరాబాద్ బేగంపేటలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాభివృద్ది కోసం అహర్నిశలు పనిచేస్తున్న సర్పంచులను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు.
"గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామస్వరాజ్య స్థాపనపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువత ఆలోచనలను మంచి వైపు మరల్చి దేశ భవిష్యత్‌కు పునాది వేసే వారిగా తీర్చిదిద్దాలి. సర్పంచులు టెక్నాలజీవైపు దృష్టిసారించి కొత్త కొత్త పద్దతులను గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. దేశ భవిష్యత్తు అంతా గ్రామాల్లోనే ఉంది. మహాత్మాగాంధీ ఆశయం ప్రకారం గ్రామాభివృద్ది కోసం అహర్నిశలు పనిచేస్తున్న సర్పంచులను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయం. నిస్వార్థంగా గ్రామాభివృద్ది కోసం పనిచేస్తున్న సర్పంచుల సేవలు చాలా విలువైనవి. అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ది చేసేందుకు యువతరాన్ని ప్రోత్సాహించాలి." - లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్
ఇదీ చూడండి: